మతపిచ్చి ముద్రగాళ్లకి ఫలితాలు కనిపిస్తున్నాయా? - కిషన్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మతపిచ్చి ముద్రగాళ్లకి ఫలితాలు కనిపిస్తున్నాయా? – కిషన్ రెడ్డి

March 10, 2022

 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాది మతపిచ్చి పార్టీ అని అబద్ధపు ప్రచారం చేసేవాళ్లకు ఈ ఫలితాలు కనబడుతున్నాయా’? అంటూ ప్రశ్నించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే గోవాలో వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశామని వెల్లడించారు. ఉత్తర భారత దేశంలో వరుసగా రెండు సార్లు గెలుపొందడం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. అలాంటిది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకే సాధ్యమైందన్నారు. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. యూపీలో పనిచేసిన బుల్డోజర్లు ఇక్కడ కూడా వస్తాయని వ్యాఖ్యానించారు.