Home > Featured > అక్టోబర్ వరకు సర్వేలు ఆపండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అక్టోబర్ వరకు సర్వేలు ఆపండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం దాడికి పాల్పడిని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఆర్వింద్, అతని తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో రాజకీయ ప్రముఖులు ఉండే ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని, టీఆర్ఎస్ నిరాశలో ఉండడం వల్లే ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు.

కల్వకుంట్ల కుటంబాన్ని చీల్చే ఉద్దేశం తమకు లేదని ప్రధాని మోదీ విధానాలు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే పార్టీలోకి చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలలో ఓడిపోతామని తేలిందని, దయచేసి అక్టోబర్ వరకు సర్వేలు ఆపమని సలహా ఇచ్చారు. ఓడిపోతామన్న భయం, పదవి పోతుందన్న అక్కసుతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నుంచి ప్రతినిధులను చేర్చుకుంది కేసీఆరేనని, వారితో కనీసం రాజీనామాలు కూడా చేయించలేదని ఎద్దేవా చేశారు.

Updated : 18 Nov 2022 9:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top