యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాక్ ఉండదు..కిషన్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాక్ ఉండదు..కిషన్ రెడ్డి

September 22, 2019

kishan reddy ..

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు మనదేశాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. పాక్ కారుకూతలకు భారత ప్రజాప్రతినిధులు దీటుగా సమాధానం ఇస్తున్నారు. 

తాజాగా కిషన్ రెడ్డి పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ యుద్దమంటూ వస్తే పాకిస్థాన్ అనే దేశం ప్రపంచపటంలోనే ఉండదని వ్యాఖ్యానించారు. ఈరోజు కాకినాడ జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీలో జరిగిన ఆర్టికల్ 370 రద్దు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏర్పాటు చేశారని, దాని వలన దాదాపు 42 వేల మంది చ‌నిపోయార‌ని తెలిపారు. ఆర్టికల్ 370 కారణంగా గతంలో పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయన్నారు. కాశ్మీర్‌లో 370 కారణంగా మహిళ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండలేదు అన్నారు. ప్రధాని మోదీ ధైర్యంగా ముందడుగు వేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారని ప్రశంసించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకుచప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు.