కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ సంస్థపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ (ఎంఈఐఎల్) వల్ల ఓ జాతీయ ప్రాజెక్టు విషయంలో రూ. 5 వేల కోట్లు ఆదా అయిందని మంగళవారం పార్లమెంటు వేదికగా కొనియాడారు. లద్దాఖ్‌లోని జోజిలా టన్నెల్ నిర్మాణానికి సంబంధించి మేఘా వల్ల కేంద్రానికి డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు.
‘ఈ సొంరంగం నిర్మాణానికి నార్వే సహా చాలా దేశాల నుంచి నిర్మాణ సంస్థల్ని పిలిచాం. రూ. 12వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలించాం. అయితే మేఘా కంపెనీ అతి తక్కువ ధర కోట్ చేసి పని దక్కించుకుంది. ఫలితంగా భారత ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల రూపాయలు మిగిలాయి. కంపెనీ పనితీరు వేగంగా, అవినీతి రహింతంగా పారదర్శకంగా ఉంది’ అని నితిన్ వివరించారు. దేశ శ్రేయస్సును దృష్ట్యా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా మేఘా నిర్మాణాలు చేపడుతోందని ఆయన అభినందించారు. లడఖ్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతూ జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మించారు. శ్రీనగర్-కార్గిల్-లేహ్ రహదారిపై కాశ్మీర్ లోయను లద్దాఖతో ఇది కలుపుతుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కోసం 11,650 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.