మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

September 17, 2020

nfgn

కరోనా మహమ్మారి సాధారణ ప్రజలతో పాటూ ప్రజాప్రతినిధులు కూడా పట్టి పీడిస్తున్నది. ఇప్పటికే ఎందరో ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కర్ణాటక సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. 

తాజాగా మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం రోజున ట్వీట్ చేశారు. అనారోగ్యంగా అనిపించడంతో కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నానని.. అందులో పాజిటివ్ గా తేలిందని తెలిపారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి కరోనా పరీక్షా చేయించుకోవాల్సిందిగా కోరారు. రిజల్ట్ నెగటివ్ వస్తేనే బయటికి రావాలని సూచించారు.