మరో కేంద్రమంత్రికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో కేంద్రమంత్రికి పాజిటివ్

September 17, 2020

Union Minister Prahlad Singh Patel tests positive for COVID-19

భారత్‌లో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎంతో మందిని బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ ఉభయసభల సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 25 మందికి పైగా పార్లమెంట్‌ సభ్యులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. దాదాపు మరో 50 మంది పార్లమెంట్‌ సిబ్బంది కూడా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో సభలు కొనసాగుతుండగానే బుధవారం కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆ మరునాడే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని.. రెండు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవారు తగు జాగ్రత్తలు తీసుకోండని ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. కాగా, కర్ణాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ(55) కరోనాతో కన్నుమూశారు.