80 కోట్ల రూ. 3 కే కిలో బియ్యం.. కేంద్రప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

80 కోట్ల రూ. 3 కే కిలో బియ్యం.. కేంద్రప్రభుత్వం

March 25, 2020

union minister Prakash Javadekar Announces Centre's Scheme To Provide Ration For Underprivileged

దేశంలోని 80 కోట్ల ప్రజలకు రూ.3కే కిలో బియ్యం, రూ.2కే కిలో గోధుమలు సరఫరా చేయాలని కేంద్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయించింది. 21 రోజుల లాక్‌డౌన్‌పై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని భేటీ తరువాత కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామన్నారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.