వైసీపీ ఎంపీ విందుకు రాజ్‌నాథ్‌సింగ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎంపీ విందుకు రాజ్‌నాథ్‌సింగ్‌

December 12, 2019

minister rajnath singh.

నర్సాపురం వైసీపీ లోక్‌సభ సభ్యులు రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో బుధవారం రాత్రి ఇచ్చిన విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి హాజరయ్యారు. వీరితో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ లోక్‌సభ పక్ష నేతలు మిథున్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రామ్మోహన్‌ నాయుడు సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. విందు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, రఘురామకృష్ణరాజు వియ్యంకుడు కెవిపి రామచంద్రరావు ఇంట్లో ఉంటుందని మొదట ఎంపీలకు సమాచారమిచ్చారు. 

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుని నివాసంలో విందుకు కేంద్ర మంత్రులు వెళ్లడం బాగుండదనే ఉద్దేశంతో చివరలో నూతన ఎంపీల తాత్కాలిక నివాసంగా ఉన్న వెస్ట్రన్‌ కోర్టుకు మార్చారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, నిన్న అర్థరాత్రి వరకు రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ.. ఆ తరువాత ఓటింగ్ జరగడంతో వారు రాలేకపోయారు. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విందులో పాల్గొనలేదు.