మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

October 27, 2020

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధినేత, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. రామ్ దాస్ అథవాలే ప్రస్తుతం దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. 

ఈ క్రమంలో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నిర్ధారించింది. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసుకోవాలోని తెలిపారు. ఆ పరీక్షల్లో నెగటివ్ వస్తేనే బయటికి రావాలని తెలిపారు. ఇటీవల నటి పాయల్ ఘోష్ ఆయనను కలిసి పార్టీలో చేరారు. రామ్ దాస్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.