ఆర్టీసీ సమ్మె..సర్వే సత్యనారాయణ యాక్టింగ్ వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె..సర్వే సత్యనారాయణ యాక్టింగ్ వీడియో వైరల్

October 22, 2019

గత 17 రోజులుగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సోమవారం రోజున ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని ముందుగానే గృహ నిర్భందం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అపహాస్యం చేసేలా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వ్యవహరించారు.

Lights. Camera. Action.

Posted by Ch Sushil Rao on Monday, 21 October 2019

కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సర్వే సత్యనారాయణను పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. అయితే అదంతా నటన అని తరువాత వెల్లడైంది. ఒక్కసారిగా సర్వేను ముట్టడించిన పోలీసులు… ఏదో సినిమా షూటింగ్‌లోలా షాట్ ఓకే అని చెప్పగానే ఆయనను వదిలేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వే తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను పోరాటాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించకూడదని చురకలు అంటించారు.