ఘనంగా ‎కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు పెళ్లి..!! - Telugu News - Mic tv
mictv telugu

ఘనంగా ‎కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు పెళ్లి..!!

February 8, 2023

 

Union Minister Smriti Irani's daughter's wedding

సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్నారు. గత నెలలో అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది. నిన్న అంటే ఫిబ్రవరి 7న నటి కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా ఒకటయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రి, నటి స్మృతి ఇరానీ కుమార్తె షనైల్ కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల పెళ్లిలకు రాజస్థాన్ వేదిక అవుతోంది. 2018లో, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కూడా జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.

ఇప్పుడు కేంద్రమంత్రి నటి స్మృతి ఇరానీ కూతురు వివాహానికి కూడా అదే కోట వేదికైంది. ఇవాళ నాగౌర్ జిల్లాలోని ఖిన్వ్సర్ కోటలో తన కుమార్తె వివాహం చేయనున్నారు స్మృతి ఇరానీ. మూడు రోజుల పాటు ఈ వివాహా వేడుకుల జరగనున్నాయి. ఈ కోటలోనే షనైల్‎ను అర్జున్ షనీల్‌ ప్రపోజ్ చేశాడట. అందుకే అదే కోటలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

కాగా ఇప్పటికే ఖిన్వ్‌సర్ కోటలో పెళ్లికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈరోజు మెహందీ, హల్దీ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 9, గురువారం వివాహం జరగనుంది. కాగా 2021 సంవత్సరంలో అర్జున్ భల్లాతో షనైల్ ఇరానీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.