కరోనాపై రాజకీయాలు చేయవద్దు అన్న కేంద్రమంత్రి సురేశ్ అంగాడి(65) అదే కరోనాకు బలయ్యారు. సెప్టెంబర్ 11న ఆయనకు కరోనా సోకగా.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. సురేశ్ అంగాడి ప్రస్తుతం రైల్వేశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిని అధికారులు ధ్రువీకరించారు. సురేశ్ అంగాడి కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. నాలుగుసార్లు (2004, 2009, 2014, 2019) ఆయన ఎంపీగా గెలుపొందారు. 1955లో జన్మించిన ఆయన 1996లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.