రాజస్థాన్‌లోని వైద్యులకు వింత అనుభవం ఎదురైంది. తీవ్ర ఆనారోగ్యంంతో ఆస్పత్రికి వచ్చి యువకుడి కడుపులో అధిక సంఖ్యలో బ్లేడ్ ముక్కలను గుర్తించి ఆశ్చర్యపోయారు. ఒకటి కాదు, రెండు కాదు సుమారు 56 బ్లేడ్ ముక్కలు ఉండడం చూసి ఖంగుతిన్నారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి బ్లేడ్ ముక్కలన బయటకు తీశారు.
జాలోర్ జిల్లాకు చెందిన యశ్పాల్సింగ్ ఒక్కసారిగా తీవ్ర కడుపునొప్పికి గురయ్యాడు. రక్తపు వాంతులు కూడా చేసుకున్నాడు. విషయం గమినించిన యశ్పాల్సింగ్ స్నేహితులు అతడిని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి మరింత విషమించిన కారణంగా.. మరో ఆసుపత్రికి తీసుకువెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో నగరంలోని మెడ్‌ప్లస్ ఆసుపత్రికి యశ్‌పాల్‌ను తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యుల వెంటనే స్కానింగ్ చూశారు. రిపోర్ట్‌లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కుప్పులుగా ఉన్న బ్లేడ్ ముక్కలను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ ప్రారంభించి వాటికి బయటకు తీశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే యువకుడి కడుపులోకి ఈ బ్లేడ్లు ఎలా వచ్చాయనేది మాత్రం తెలియరాలేదు. అతడు జాలోర్ జిల్లాలోని సంచోర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతడు బాలాజీ నగర్లో స్నేహితులతో కలిసి ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.