unique tradition of shoes in front of temple in karnataka
mictv telugu

అక్కడ అమ్మవారికి చెప్పులే కానుకలు..

November 12, 2022

unique tradition of shoes in front of temple in karnataka

మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత..ఒక్కో దేవునికి ఒక్కో ఆచారం. దేవాలయాలు బట్టి భక్తులు మొక్కులు సమర్పిస్తుంటారు. ఆలయం ఏదైనా చెప్పులు బయట వదిలి.. దేవుడి విగ్రహం ఎదురుగా నిల్చుని చేతులెత్తి మొక్కుతుంటారు. అయితే కర్ణాటకలోని ఓ ఆలయంలో అమ్మవారిని భక్తులు వింతగా పూజిస్తున్నారు. అమ్మవారికి కానుకగా చెప్పులను సమర్పించి, వీపు వైపు మొక్కి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కర్ణాటక కలబురిగి జిల్లాలోని గోల లక్కమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ప్రతి ఏడాది దీపావళి తర్వాత వచ్చే పంచమి నాడు ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ అమ్మవారిని భక్తులు కాళికా దేవికి మరో రూపంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఉత్సవానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. అయితే లక్కమ్మ అమ్మవారిని భక్తులు వింతగా పూజిస్తారు. కానుకలుగా ఒక జత చెప్పులను సమర్పించి తమ కోర్కెలను కోరుకుంటారు. అంతేకాదు దేవత వీపు వైపుగా మొక్కుతూ పూజిస్తారు. ఆ గుడిలో ఇలా చేస్తేనే దేవత తమ కోరికలు తీరుస్తుందని భక్తులు చెబుతున్నారు.