కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే పాటించాల్సిన సూచనల్లో భౌతిక దూరం ముఖ్యమైనది. మనిషికి మనిషికి మధ్య కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలనేది నిపుణుల సూచన. తద్వారా కరోనా వైరస్ ను త్వరగా పంపించవచ్చని నిపుణులు అంటున్నారు. అయినా కూడా భౌతిక దూరాన్ని మెజారిటీ జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భౌతిక దూరం పాటించడానికి 1point5 అనే యాప్ ను రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీన్ని వాడాలంటే కచ్చితంగా మీ మొబైల్‌లో బ్లూటూత్, జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. యాప్ ఓపెన్ చేయగానే ‘గెట్ స్టార్టెడ్’ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలోకి ఇతరులు వస్తే హెచ్చరించాలనేది నిర్ణయించుకోవాలి. తరువాత ఎవరిపైన దగ్గరికి వస్తే ఫోన్ అల్లారం మోగుతుంది. ఒకేసారి ఎంతమంది యూజర్లు మీకు దగ్గరల్లోకి వచ్చినా… వాళ్ల మొబైల్ మోడల్ పేరుతో మీకు ఎంతదూరంలో ఉన్నారనేది చూపిస్తుంది. దగ్గర్లో ఎవరూ లేకపోతే భౌతిక దూరం పాటిస్తున్నందుకు ధన్యవాదాలు అని మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.