భారత్‌లో 4.5 కోట్ల మహిళలు మిస్సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో 4.5 కోట్ల మహిళలు మిస్సింగ్

July 1, 2020

missing

భారత్ లో మహిళల హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, తాజాగా ‘ప్రపంచ జనాభా-2020’పై ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) విడుదల చేసిన నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 

గత 50 ఏళ్లలో భారత్ లో ఏకంగా 4.58 కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని యూఎన్ఎఫ్‌పీఏ ఆ నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్ల మంది అదృశ్యమయ్యారని వివరించింది. 1970లో ఇది 6 కోట్లగా ఉండగా, తాజాగా అది 14 కోట్లకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో ఉంది. చైనాలో 7.23 కోట్ల మంది మహిళలు గల్లంతు కాగా, 2013-17 మధ్య భారత్‌లో ఏకంగా 4.6 లక్షల మంది బాలికలు అదృశ్యయ్యారు.