వనపర్తిలో దారుణం.. పూజారిపై కత్తులతో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

వనపర్తిలో దారుణం.. పూజారిపై కత్తులతో దాడి

April 17, 2019

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెబ్బేరు మండలం శాఖాపూరం గ్రామానికి చెందిన నంబి శ్రీనివాసులు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. కాగా, మంగళవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు.

Unknown people try to kill temple pujari in wanaparthy.

శ్రీనివాసులు ఇంటి వద్ద ఉండగా దాడికి పాల్పడ్డారు. భయంతో కేకలు వేయగా దాడికి పాల్పడిన వారు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పూజారిని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తరలించారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.