Unknown Persons Destroyed Anna Canteen Again in Kuppam chittoor district
mictv telugu

మరోసారి అన్న క్యాంటిన్ ధ్వంసం.. వారం రోజుల్లో ఇది రెండోసారి

August 30, 2022

చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థి నెలకొంది. అర్థరాత్రి వేళ మరోసారి అన్న క్యాంటీన్ ధ్వంసం కలకలంరేపింది. సోమవారం రాత్రి 11 గంటలకు దాడి చేసి అక్కడ ఏర్పాట్లు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. . వైసీపీ కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడి వుంటారని ఆరోపిస్తున్నారు. గతవారమే చంద్రబాబు పర్యటన జరుగుతున్న క్రమంలో అన్న క్యాంటిన్‌ను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ క్యాంటిన్ ధ్వంసం చేయడం కలకలంరేపుతోంది.

అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని.. అర్థరాత్రి దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని.. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని.. అన్నక్యాంటీన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.