‘ఊరు విడిచి వెళ్లండి.. లేదంటే మీ ప్రాణాలు తీస్తాం’ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఊరు విడిచి వెళ్లండి.. లేదంటే మీ ప్రాణాలు తీస్తాం’

May 10, 2022

కడప జిల్లాలో సీబీఐ బృందం కారు డ్రైవర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. కడప జిల్లా వదిలి వెళ్లకపోతే చంపుతామంటూ.. దుండగులు పాత బైపాస్ రోడ్‌ దగ్గర కారును ఆపి డ్రైవర్‌ను బెదిరించారు.

దీంతో చిన్నచౌక్‌ పోలీస్ స్టేషన్‌లో సీబీఐ బృందం కారు డ్రైవర్‌ (driver) ఫిర్యాదు చేశారు. బెదిరింపుల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఫిర్యాదుపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.