మోదీకి మసూద్ అజర్ చాలెంజ్.. నీ కంటే నేనే అంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి మసూద్ అజర్ చాలెంజ్.. నీ కంటే నేనే అంటూ..

March 16, 2019

భారత్‌లో ఎన్నో ఉగ్రవాద దాడులు చేయిస్తూ పాకిస్తాన్ అండదండలతో చెలరేగుతున్న జైషే మహహ్మద్ అధినేత మసూద్ అజర్ ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతని కంటే తానే ఫిట్ గా ఉన్నానని, ఎందులోనైనా సరే తానే ఫిట్ అని నిరూపికుంటానని చాలెంజ్ విసిరాడు. తనపై భారత నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.  పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం సంతోషంగా ఉందన్నాడు. ఆత్మాహుతి దాడి చేసిన అదిల్ దార్ రగిల్చిన ఈ మమట ఎన్నటికీ ఆరిపోదని, కశ్మీర్‌లోతమ పనితీరుకు అదిల్ దాడి చక్కని నిదర్శనమని పేర్కొన్నాడు. 

Unlike Narendra Modi I am fully fit Masood Azhar s claim about Balakot strike his ill health.

బాలాకోట్ జరిగిన భారత వాయుసేన  దాడుల్లో జైషే మహ్మద్‌ భారీగా దెబ్బతిందని మోదీ చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదు.. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా కిడ్నీలు, కాలేయం చక్కగా పనిచేస్తున్నాయి. ఏ ఆటలోనైనా, సరే, విలువిద్యలోనైనా సరే,  షూటింగ్ పోటీలోనైనా సరే మోదీ నాతో పోటీపడితే అతని కంటే నేనే ఫిట్ అని నిరూపించుంటా.. ’ అని సవాల్ చేశాడు. పాక్‌లోని బాలాకోట్‌లో జరిపిన దాడుల్లో మసూద్ గాయపడినట్లు వార్తలు రావడం తెలిసిందే. అతడు చావు బతుకుల్లో ఉన్నారని, కిడ్నీలు పాడయ్యాయని వార్తలు వచ్చాయి. దీంతో మసూద్ తాను నిక్షేపంగా ఉన్నానని చెబుతూ ఈ చాలెంజ్ చేశాడు. జైషే మహ్మద్ పత్రిక ‘అల్ ఖలామ్’లో  రాసిన వ్యాసంలో ఈ అవాకులు చవాకులు పేలాడు.