లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలు

June 29, 2020

Unlock 2.0

దేశంలో నిత్యం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. వైరస్ నుంచి ప్రజలను కాపాడే ఉద్దేశంలో లాక్‌డౌన్ అనివార్యమైంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టంచేసింది. ఈమేరకు రాత్రి ఒక గంట కర్ఫ్యూ పెంచారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగనుంది. ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్‌, సినిమా హాల్స్‌, మెట్రో రైల్స్, ఆడిటోరియంలకు జూలై 31 వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.