ఉన్నావ్ రేప్ కేసు తీర్పు 16న.. బీజేపీ ఎమ్మెల్యేకి శిక్షపడుతుందా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఉన్నావ్ రేప్ కేసు తీర్పు 16న.. బీజేపీ ఎమ్మెల్యేకి శిక్షపడుతుందా? 

December 10, 2019

Unnao case kuldip sengar verdict to be announced 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాలిక అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు ఇరుపక్షాల వాదానలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 16న తీర్పు ప్రకటిస్తామని జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ వర్మ తెలిపారు. కోర్టు ఈ నెల 2న కోర్టు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసుకుంది. 2017లో నమోదైన ఈ కేసులో నాటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడు. తర్వాత పార్టీ అతణ్ని బహిష్కరించింది. 

సెంగార్, అతని అనుచరులు తనను కిడ్నా చేసి అత్యాచారం చేశారని బాధితురాలు కేసు పెట్టింది. తర్వాత కేసు అనేక మలుపులు తిరిగింది. ఆమె తన బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. సెంగారే ఈ పని చేయించినట్లు కేసు నమోదైంది.  లారీ ఢీకొట్టడంతో బాధితురాలి బంధువులిద్దరు చనిపోయాడు. ఆమె ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఆమె తండ్రి కూడా వేరే పోలీస్ కస్టడీలో చనిపోయాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని సీఎం ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.