ముగ్గురు పిల్లల తల్లిని రేప్ చేస్తారా?.. బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు పిల్లల తల్లిని రేప్ చేస్తారా?.. బీజేపీ ఎమ్మెల్యే

April 12, 2018

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై నమోదైన అత్యాచార కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం జరక్కపోవడం, ఆమె కుటుంబం యూపీ సీఎం ఇంటిముందు ఆత్మహత్యకు యత్నించడం, తండ్రిని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపడంపై తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క.. నిందితుడిని వెనకేసుకుని రావడానికి బీజేపీ పడరాని పాట్లుపడుతోంది. అతనికి అనుకూలంగా మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

‘ముగ్గురు పిల్లల తల్లిని ఎవరు రేప్ చేస్తారు? అసలు అది సాధ్యమేనా? అమె చెబుతున్నవన్నీ అబద్ధం. మనోవిశ్లేషణ కోణం నుంచి నేను చెబుతున్నారు..కుల్దీప్ అలా చేసి ఉండడు. అతనిపై ఎవరో కుట్రపన్నారు..’ అని సురేంద్ర చెప్పుకొచ్చాడు. బాధితురాలు గతంలోనూ ఒక వ్యక్తిపై కేసు పెట్టిందని, అతడు అన్యాయంగా ఆరు నెలలు జైల్లో ఉన్నాడని చెప్పాడు. అయితే కుల్దీప్ అత్యాచారం చేసి ఉంటే అతణ్ని శిక్షించాల్సిందేనని మాటమార్చి ముక్తాయించాడు.