భార్యతో అసహజ శృంగారం..రూ.కోటి డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

భార్యతో అసహజ శృంగారం..రూ.కోటి డిమాండ్

July 4, 2022

 

ఓ భర్త కట్టుకున్న భార్యతో అసహజ శృంగారానికి పాల్పడుతూ, వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంతేకాదు, కోటి రూపాయలు ఇవ్వకుంటే తీసిన నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. చేసేది ఏమీలేక తన భర్త ఇలా బెదిరిస్తున్నాడని అత్తమామలకు చెప్తే, వాళ్లు కూడా తమ కొడుకుకే సపోర్ట్ చేస్తున్నారని అతడి భార్య (30) భర్తపై, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో జరిగింది.

కాన్పూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”బాధిత మహిళ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. కాన్పూరుకు చెందిన వాడు. అదనపు కట్నం కోసం గతకొన్ని రోజులుగా మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడిన వీడియోలను, ఫోటోలతో సోషల్ మీడియలో పోస్ట్ చేస్తానని ఆమె భర్త, అత్తమామలు బెదరిస్తున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో రాశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని అన్నారు.

మొదటగా బాధిత మహిళ తన భర్త, అత్తమామలపై ఇండోర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో మహిళ భర్త కాన్పూరుకు చెందిన వాడు కావడంతో ఇండోర్ పోలీసులు ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న లసుడియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.