గౌరి హత్యపై ఐరాస సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

గౌరి హత్యపై ఐరాస సీరియస్

September 12, 2017

మహిళా జర్నలిస్టు గౌరి లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భారతదేశంలో హక్కుల కార్యకర్తలపై దాడులు సాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి మాన హక్కుల హై కమిషనర్ జీద్ రాద్ అల్ హుసేన్ మండిపడ్డారు. వారిని వేధిస్తున్నారు, వారికి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని విమర్శించారు.

‘భరాత్ లో అసహనం పెరిగిపోతోంది. ఆవులను రక్షించే పేరుతో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోంది’ అని జెనీవాలో సోమవారం జరిగిన హ్యూ మన్ రైట్స్ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జమ్మూకశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిపై పాకిస్తాన్, భారత్ లు తమకేమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. తమ దేశంలోని రోహింగ్యా ముస్లింలను బయటికి పంపేందుకు భారత్ చేస్తున్న యత్నాలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మయన్మార్ లో వీరిపై దాడులు సాగుతుండటం తెలిసిందే.