పాక్‌కు భంగపాటు.. తేల్చిచెప్పిన ఐరాస అధినేత - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌కు భంగపాటు.. తేల్చిచెప్పిన ఐరాస అధినేత

September 11, 2019

Kashmir issue.

కశ్మీర్ అంశంపై ప్రపంచ వేదికల్లో నానా యాగీ చేయబోయి బొక్కబోర్లా పడుతున్న పాకిస్తాన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఐక్యరాజ్యసమితి అయినా ఈ విషయంలో తమకు అనుకూలంగా కాకపోయినా, కనీసం  ‘మానవ హక్కుల పేరు’తో పరోక్షంగానో సహకరిస్తుందనుకున్న పాక్ ఆశలు నిలువెల్లా నీరుగారిపోయాయి. కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఐరాస ప్రధాన కార్యదర్వి ఆంటోనియో గుటెరస్ తేల్చిచెప్పారు. 

‘ఈ వివాదాన్ని భారత్, పాక్‌లు చర్చలతో పరిష్కరించుకోవాని గుటెరస్ కోరుతున్నారు. రెండు దేశాల మధ్య నెల కొన్న ఉద్రిక్తతపై ఆయన ఆందోళన చెందుతున్నారు… ’ అని గుటెరస్ ప్రతినిధి స్టేఫేన్ దజారిక్ చెప్పారు. ఇటీవల జరిగిన జీ7 సదస్సులో గుటెరస్ భారత ప్రధాని మోదీని కలుసుకున్నారు. కశ్మీర్ వివాదంలో ఐరాస మధ్యవర్తిత్వం వహిస్తుందా అని విలేకర్లు అడగ్గా, మా విధానం మీకు తెలుసుగా అంటూ అది ద్వైపాక్షిక అంశమని గుర్తు చేశారు.