పాకిస్తాన్ ఎత్తులు చిత్తు.. భద్రతా మండలిలో చుక్కెదురు
పాకిస్తాన్ కుయుక్తులు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలు తిప్పికొట్టాయి. చైనాతో కలిసి భారత్‌పై కుట్ర పన్నిన పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఐరాసలో ఎండగట్టాలని ప్రయత్నించిన దాయాది దేశం బొక్కబోర్లా పడింది. 48 సంవత్సరాల తరువాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశంపై జరిగిన చర్చలో పాక్ వాదనలు ఏమాత్రం నిలవలేదు.
చైనా,పాకిస్తాన్ ఆరోపణలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. శుక్రవారం సుమారు 73 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో సభ్యదేశాలన్ని భారత్ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమేనని రష్యా ప్రకటించింది. కశ్మీర్ అంశం ధ్వైపాక్షి అంశమని ఇతర దేశాల జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. చైనా ఒక్క దేశం పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవగా రష్యా, ఇంగ్లాండ్, అమెరికా,ఫ్రాన్స్ దేశాలు భారత్ వైపు నిలిచాయి. దీంతో పాకిస్తాన్ మరోసారి తోక ముడవక తప్పలేదు.