కరోనా విశ్వరూపం.. రోజుకు 15 లక్షల కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా విశ్వరూపం.. రోజుకు 15 లక్షల కేసులు

April 9, 2022

fvbf

యూరప్‌లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అక్కడ రోజుకు 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్టు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. మరోవేవ్ యూరప్‌ను కుదిపేస్తోందని, ప్రతీ నాలుగు నెలలకు కొత్త వేరియంట్ పుట్టుకురావడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఆయన ఓ సమావేశంలో వీడియో ద్వారా తన సందేశమిస్తూ వెల్లడించారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ప్రపంచంలో ఉన్న అసమానతల వల్లే కరోనా పెరిగిపోతుందని వాపోయారు. అనేక పేద దేశాలకు నేటికీ కరోనా వ్యాక్సిన్ అందటం లేదని, ఈ విషయంలో ఆయా ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ మానవ, ఆర్ధిక సంక్షోభానికి కారణమవుతుందని, భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. విచారం వ్యక్తం చేశారు. బీఏ 1, బీఏ 2 కలిసి ‘ఎక్స్‌ఈ’ అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని, చైనా షాంఘై నగరం అతలాకుతలం అయిందన్నారు. ప్రతీ దేశానికి 70 శాతం వ్యాక్సిన్లు అందజేయాలనే లక్ష్యానికి ఇంకా చాలా దూరంలో ఉన్నామని వ్యాఖ్యానించారు.