Uno on Ukraine and Russia winner
mictv telugu

రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపెవరిది? ఐరాస ప్రకటన

June 3, 2022

Uno on Ukraine and Russia winner

వంద రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు పక్షాల నుంచి నాలుగు వేల మందికిపైగా మరణించారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ 3వేల మంది కోల్పోయింది. తాము రోజూ 100 మంది సైనికులను కోల్పోతున్నామని ఆ దేశాధ్యక్షకుడు జెలెన్ స్కీ ఒప్పుకున్నారు. మూడు నెలలుగా బాంబులు దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడంతో రష్యాకూ దిక్కు తోచడం లేదు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారన్నది పెద్ద సందేహంగా మిగిలింది.

యుద్ధ ఫలితంగా ఉక్రెయిన్‌లో ఐదో వంతు భాగం తమ అధీనం కిందికి వచ్చిందని రష్యా పేర్కొంది. ఈ లెక్కన ఉక్రెయిన్ మొత్తం రష్యా కిందికి రావాలంటే ఏళ్ల తరబడి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇరు దేశాలకు గొడ్డలిపెట్టే.
యుద్ధాన్ని ఆపాలంటు మొత్తుకుంటున్నఐక్యరాజ్య సమితి యుద్ధకాండకు వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆవేదనతో ఓ ప్రకటన చేసింది. ‘ఈ యుగంలో ఎవరూ గెలవలేదు. విజయం ఎవరికీ దక్కదు. ఈ వంద రోజుల్లో దక్కిన ఫలితం భారీ నష్టమే. ఎంతోమంది ఉద్యోగాలు, ఇళ్లు, ప్రాణాలు కోల్పోయారు’ అని ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో సంక్షోభ సమయాల సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ఐరాస సహాయ కార్యదర్శి అమిన్ అవద్ ఈమేరకు ప్రకటన చేశారు.