షర్మిల పాదయాత్రలో అపశృతి.. తేనెటీగలు దాడి - MicTv.in - Telugu News
mictv telugu

షర్మిల పాదయాత్రలో అపశృతి.. తేనెటీగలు దాడి

March 23, 2022

14

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజుల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. మోట కొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద ఒక చెట్టు కింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి.

అయితే, ఆమె సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయి ఆమెను సురక్షితంగా కాపాడారు. ఇదే సమయంలో పలువురు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటివరకు షర్మిల పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరోవైపు మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.