మందుబాబులకు అడ్డాగా అన్న క్యాంటీన్‌ భవనం - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు అడ్డాగా అన్న క్యాంటీన్‌ భవనం

June 13, 2022


పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్… ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. తాగుతూ, తుళ్లుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా… అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని అన్న క్యాంటీన్‌ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మారాక వాటిని మూసేయడంతో చాలాచోట్ల ఆ భవనాలను గ్రామ సచివాలయాలుగా వాడుకుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉండవల్లి కేంద్రంలో మద్యం తాగి ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. క్యాంటీన్‌ లోపల, ఆవరణలో తాగి పడేసిన మద్యం సీసాలే కనిపిస్తున్నాయి. గతంలో విశాఖ జిల్లా యలమంచిలిలోని అన్న క్యాంటీన్ భవనంలో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి.