డైనమిక్ సీఎం ఇదేం రివార్డ్ ? - MicTv.in - Telugu News
mictv telugu

డైనమిక్ సీఎం ఇదేం రివార్డ్ ?

July 3, 2017

ఎటు పోతోంది మన వ్యవస్థ ? సామాన్యుడు, నీతి, నల్లధనం, నిజాయితీల గురించి వల్లించిన ప్రభుత్వం అవలంభిస్తున్న తీరేంటి ? రూల్స్ సామాన్యుడికైనా, సెలెబ్రిటీకైనా సేమ్ అని వాదించిన లక్నో మహిళా పోలీస్ అధికారి శ్రేష్ఠ్ ఠాకూర్ కు అక్కడి బిజేపి సర్కార్ ఇచ్చిన రివార్డ్ ఏంటో తెలుసా .. ఉద్యోగ బదిలి ! ఇది ఆమెకు గర్వంతో కూడుకున్న సిగ్గుచేటుగా లేదూ ? ఎక్కడో నేపాల్ మారుమూల ప్రాంతానికి ఆమెను ఆఘమేఘాల మీద బదిలీ చెయ్యటం వెనుక కమలం పార్టీ పే..ద్ద రాజకీయ కుట్ర దాగి వున్నదని స్పష్టం అవతున్నది. నీతులు వల్లించే యూపీ సీఎం ఆదిత్య నాథ్ యోగి వెనక నుండి ఇలా గోతులు కూడా తవ్వుతాడా ? అంటే ఖచ్చితంగా తవ్వగలడని తేటతెల్లం లవుతోంది శ్రేష్ఠ్ ఠాకూర్ మీద జరిగిన దృష్టాంతాన్ని చూసాక.

ఇంతకీ ఆమె చేసిన మొదటి తప్పు ఏంటి ? తన డ్యూటీ సరిగ్గా చెయ్యటమే తను చేసిన మొదటి తప్పు ? బిజెపీ దృష్టిలో బైక్ పై వెళ్తున్న ఆ పార్టీ నేత ప్రమోద్ కుమార్ హెల్మెట్ పెట్టుకోకపోవడం రూల్స్ ను వ్యతిరేకించడం కానే కాదు, తప్పు అస్సలే కాదు ? నాయకులు రూల్స్ మాట్లాడతారు గానీ వాటిని ఫాలో అవరు.. ఇదీ యూపీ పువ్వుపార్టీ పాజిటివ్ అంతరంగం కావచ్చు ? ఇంతకీ శ్రేష్ఠ్ ఠాకూర్ చేసిన మూడో తప్పు హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్ళను ఆపి చలాన్ కట్టాల్సిందేనని రూల్స్ మాట్లాడటం ? అందుకు వాళ్ళు చెయ్యని తప్పు సీఎం మా అయ్య చుట్టం అని శ్రేష్ఠ్ ఠాకూర్ కు వాళ్ళు యాంటీ సమాధానాలివ్వటం అస్సలు తప్పు అనబడే కోవలోకి రానే రాదేమో ? అందుకు ఆమె చేసిన నాలుగో తప్పు ‘ బిజేపి లీడర్లకు రూల్స్ మినహాయింపని సీఎంతో లేఖ రాసుకు రండని ’ తొందరపడి చెప్పడం తప్పే ? వాళ్ళ సోది వినకుండా వాళ్ళతో చలానా కట్టించి, జైలుకు పంపినందుకు పాపం ఆమెకు దక్కిన గొప్ప గౌరవం.. అకస్మిక బదిలీ ??

హుం.. ఇంకా ఎక్కడుంది యోగీ .. మాట్లాడే నీతి, న్యాయం ? అన్నీ వాళ్ళ పంచన కృష్న బల్లులై వాళ్ళు సైగ చేసినప్పుడే సత్యాన్ని పలుకుతాయి అదీ వాళ్ళకు అనుకూలంగా !? ఒక అధికారికే చుక్కలు చూపించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరు ఇక సామాన్య ప్రజల విషయంలో ఎలా వుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ?? ఇక్కడ కొసమెరుపు ఏంటో తెలుసా.. తనకు నేపాల్ మారుమూల ప్రాంతానికి బదిలీ అయినా శ్రేష్ఠ్ ఠాకూర్ మాత్రం చాలా గర్వంగా ఫీలౌతున్నానని అంటోంది. ఇది నా సిన్సియారిటీకి దక్కిన గౌరవం అనుకుంటున్నాను అని చెప్పింది. నిజమే నిజాయితీకి పాడె కడుతున్న ప్రభుత్వాలకు సెల్యూట్ లు చెయ్యకపోతే బదిలీ కాదు ఏకంగా ఉద్యోగమే ఊడిపోతుండొచ్చు మరి !?