UP: Bareilly DM bans jeans, t-shirts in office
mictv telugu

జీన్స్, టీ షర్టులతో ప్రభుత్వోద్యోగులు ఆఫీసులకు రావొద్దు.. వార్నింగ్

September 7, 2022

ప్రభుత్వ అధికారులు అధికారిక దుస్తులు ధరించే రావాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో(కలెక్టర్ ఆఫీస్) ఉద్యోగులు, అధికారులు తప్పని సరిగా అధికారిక డ్రెస్ కోడ్ లో రావాలని హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు కార్యాలయంలో కేవలం అధికారిక దుస్తులే ధరించాలని.. జీన్స్, టీషర్టులు వేసుకోకూడదని అన్నారు జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) శివకాంత్ ద్వివేది.

ఈ ఆదేశాలను ఉద్యోగులు స్వాగతించారు. ఇది కొత్త విషయం కాదని.. డ్రెస్ కోడ్ నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉందని.. ఆఫీసులో ఫార్మల్ దుస్తులు ధరించే ఇకపై ఉద్యోగులు వస్తారని.. కొంత మంది జీన్స్, టీషర్టులు ధరించి వచ్చేవారని ప్రస్తుతం వారంతా డ్రస్ కోడ్ ఆదేశాలను పాటించాల్సిందే అని అడ్మినిస్ట్రేషన్ అధికారి శివేష్ కుమార్ గుప్తా అన్నారు. ఇది మంచి నిర్ణయం అని ఆయన అన్నారు. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం, ప్రభత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు క్యాజువల్స్ ధరించడాన్ని గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధించింది.