యూపీలో అతిపెద్ద ఫిలిం సిటీ.. రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా.. - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో అతిపెద్ద ఫిలిం సిటీ.. రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా..

September 19, 2020

yogi

రామోజీ ఫిలిం సిటీని తలదన్నేలా అతిపెద్ద స్టూడియోను నిర్మించేందుకు యూపీ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాధనలు సిద్ధం చేసి అనువైన భూమి కూడా ఎంపిక చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు.నోయిడాలో దీన్ని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్‌పట్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలతో కూడిన అభివృద్ధి ప్రాజెక్టుల సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలోనే అతి పెద్దగా, సౌకర్యవంతంగా ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

యూపీలో దీనితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు.  గోల్ఫ్ కోర్సు , మెట్రో విస్తరణ, షూటింగ్ రేంజ్ వంటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష జరిపారు. 2025 మార్చిలోగా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగం చేస్తూ అక్ర‌మాల‌కు పాల్ప‌డితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇప్పటికే అయోధ్యలో అతిపెద్ద రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇక ఫిలిం సిటీ నిర్మాణంతో మరింత అభివృద్ధి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.