వలస కార్మికుల కోసం ప్రత్యేక కమిషన్..యోగి సంచల నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

వలస కార్మికుల కోసం ప్రత్యేక కమిషన్..యోగి సంచల నిర్ణయం

May 25, 2020

Yogi Adityanath

వలస కూలీలను ఆదుకోవడానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా మైగ్రేంట్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదిత్యానాథ్‌ అధికారులను ఆదేశించారు. యూపీ నుంచి వలస కూలీలను ఇతర రాష్ట్రాలు కోరుకుంటే నేరుగా పంపడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. 

ఇతర రాష్ట్రాల్లో యూపీ వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారన్నారు. యూపీ ప్రభుత్వం వలస కార్మికులకు బీమా, సామాజిక సంక్షేమం కల్పించే బాధ్యతను చేపడుతుందని చెప్పారు. వారు ఎక్కడ పనిచేసినా వారికి యూపీ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే యోగీ ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)‌ అధ్యక్షుడు‌ రాజ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు. యూపీ వలసకూలీలతో పనిచేయించుకోవాలంటే అనుమతి కోరాలని ఆదిత్యానాథ్‌ అన్నారని తెలిసింది. యూపీ వలసకూలీలు మహారాష్ట్రలో పనిచేయాలనుకునే ఇక్కడి ప్రభుత్వం అనుమతి కోరాల్సిందేనని అన్నారు. పనిచేసేందుకు ఇక్కడకు వచ్చే ప్రతి కార్మికుడు ప్రభుత్వంతో పాటు స్ధానిక పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని, వారంతా డాక్యుమెంట్లను, ఫోటోలను సమర్పించాలని ఠాక్రే తెలుపారు.