జీఎస్టీ ఆ మంత్రిని బుక్ చేసింది...! - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీ ఆ మంత్రిని బుక్ చేసింది…!

June 30, 2017

పాపం యూపీ మంత్రి రమాపతి శాస్త్రి. వ్యాపారులతో సమావేశానికి టైమ్ కొచ్చారు. జీఎస్టీపై ఏదో లెక్చర్ దంచుదామనుకున్నారు. అదిరిపోయే లెవల్లో స్పీచ్ ఇవ్వాలని మైక్ అందుకున్నారు. మొదలు పెట్టీపెట్టగానే వ్యాపారుల నుంచి క్వశ్చన్. జీఎస్టీ పూర్తిరూపం చెప్పాలని మంత్రిని అడిగారు. అందుకు ఆయన తడబడుతూ చెప్పలేకపోయారు. అప్పటికీ పక్కన ఉన్న మరికొందరు ఆయనకు సమాధానాన్ని అందించబోయారు.. ఆయనకు మాత్రం అది అర్థం కాలేదు.

తనకు జీఎస్టీ అంటే ఏంటో తెలుసు.. కానీ అది ఇప్పుడు గుర్తు రావడం లేదు. జీఎస్టీకి సంబంధించిన అన్ని పత్రాలు నా దగ్గర ఉన్నాయని మంత్రి రమాపతి శాస్త్రి చెప్పుకొచ్చారు. ఫస్టు నుంచి అమల్లోకి రాబోతున్న వస్తు సేవల పన్ను విధానంపై ప్రజల్లో అనుమానాల్ని తీర్చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ సభ్యుల్ని ఆదేశించారు. కానీ సామాజిక సంక్షేమ, గిరిజన వ్యవహారాలు చూసే మంత్రి రమాపతి శాస్త్రి జీఎస్టీ అంటే ఏంటో చెప్పలేకపోవడం కొసమెరుపు. మంత్రి శాస్త్రి ఈ సారైనా నేర్చుకోని పోండి..లేకపోతే డైనమిక్ సీఎం యోగి పరువుపోతుంది.