హత్రాస్ కేసుపై సీఎం యోగి సీరియస్.. ఎస్పీ, డీఎస్పీపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

 హత్రాస్ కేసుపై సీఎం యోగి సీరియస్.. ఎస్పీ, డీఎస్పీపై వేటు

October 3, 2020

Police

యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో చర్యలకు ఉపక్రమించారు. ఎస్పీ, డీఎస్పీ తోపాటు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అవసరమైతే వారికి నార్కో పాలీగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించాలని సూచించారు. అత్యాచార బాధితురాలి విషయంలో పోలీసులు చూపిన అత్యుత్సాహం కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. 

సెప్టెంబర్ 16 అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత యువతి ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పయింది. ఆమె నాలుక కోసి, నడుం విరిచి అత్యంత క్రూరంగా వ్యవహరించారు. దీంతో ప్రజలు ఆందోళనకు దిగారు. యువతికి న్యాయం చేయాలని పట్టుబట్టడంతో పోలీసులు అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండానే ఖననం చేశారు. ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే దహనం చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం యోగి స్పందించారు. హడావుడిగా దహనం చేసి అత్యుత్సాహం ప్రదర్శించినందుకు సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు.