పట్టిస్తే రెండు లక్షలు..! - MicTv.in - Telugu News
mictv telugu

పట్టిస్తే రెండు లక్షలు..!

June 24, 2017


ఆడపిల్ల అన్ని రంగాల్లో మొగవాళ్లతో సమానంగా దూసుకుపోతున్న ఈరోజుల్లో కూడా అక్కడక్కడా ఇంకా బ్రూణ హత్యలు జరుగుతూనేవున్నాయి,కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు,ఎవ్వరికి తెలీనివ్వకుండా గుట్టుగా కడుపులోనే చంపేస్తున్నారు కొందరు తల్లితండ్రులు.

ఎందుకింత అమానుషం

ఆడపిల్ల అయితే వాళ్లను పెంచాలి చదివించాలి లక్షల కట్నాలు ఇచ్చి పెండ్లి చెయ్యాలి అనే ఆలోచిస్తున్నారు తప్ప ఒకవేళ తర్వాత కొడుకు పుడితే వాడు పెద్దయ్యాక వాడికి పెళ్లి చెయ్యాలంటే కావల్సింది ఆడపిల్లే అని ఆలోచించడం లేదు.బిడ్డపుడితే భారమవుతుందని ఆలోచించే కొందరు తండ్రులు…తొమ్మిది నెలలు తన భారాన్నికడుపులో మోసింది కూడా ఓ ఆడపిల్లే అన్న వియషం మర్చిపోతున్నారు.ఆడపిల్లకు అమ్మకడుపులో కూడా సేఫ్టీలేకుండా చేస్తున్నారు.

సియం ఆఫర్

కడుపులో ఉన్నది ఆడ మొగ అన్న విషయం చెబితే చట్ట ప్రకారం అది నేరం.కానీ పైసలకు ఆశపడి కొన్ని దవాఖాన్లు కొన్ని స్కానింగ్ సెంటర్లు కడుపులో ఉన్నది ఆడోమగో చెప్పేస్తున్నారు.ఆడపిల్ల భారం అనుకున్న తల్లిదండ్రులు వాళ్లను ప్రపంచం చూడకముందే తుంచేస్తున్నారు.అందుకే గర్భిణులకు సియం బంపర్ ఆపర్ ఇచ్చారు..అదేంటంటే లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే కేంద్రాల ఆచూకీ తెలిపిన గర్బిణులకు లక్ష రూపాల నగదును ప్రకటించారు..అయితే ఇది మనదగ్గర కాదండోయ్ ఉత్తరప్రదేశ్ ల.

ఆడపిల్లల కరువు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంల గత పదేండ్లలో జరిగిన జనాభా లెక్కలు చూస్కుంటే అందులో మొగవాళ్లే ఎక్కువున్నారట ఆడపిల్లల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందట..అందుకే ఉత్తరప్రదేశ్ సియం యోగీ ఆదిత్య ఈ నిర్ణయం తీసుకున్నారు…గర్బినులకు లక్షే కాదు…ఆ స్కానింగ్ కేంద్రాల ఆచూకీ తెలిపిన వారికి అరవైవేలు…మరియు గర్బిణీ తో వచ్చిన భర్తలేక ఇతర కుటుంబసభ్యులకు ఇంకో 40 వేలు ఇస్తారట.అంటే మొత్తం రొండు లక్షలన్నమాట..అయితే దీనిలో కండిషన్స్ కూడా ఉన్నాయ్..మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వరట…వాళ్లను పట్టిచ్చినప్పుడు కొన్ని…ఈకేసు కోర్టుకు వెళ్లినప్పుడు సాక్షం చెప్పినప్పుడు కొన్ని..నేరం చేసినవాళ్లకు శిక్ష పడ్డాక కొన్ని ఇలా మొత్తం మూడు ఇన్టాల్ మెంట్స్ లలో ఇస్తారట.