ఆ మూడింటిని చూస్తే యోగి గజ గజ...! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ మూడింటిని చూస్తే యోగి గజ గజ…!

July 13, 2017

యోగి ఆదిత్యనాథ్..సింపుల్లీ సూపర్ సీఎం. డైనమిక్ డెసిషన్స్ కు కేరాఫ్. వందరోజుల్లోనే ఇంచుమించు మోదీ ఇమేజ్ ని క్రాస్ చేసే లెవల్ కు వెళ్లారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న దేశం దృష్టిని ఆకర్షించింది. అలాంటి డైనమిక్ సీఎం యోగి ఆ మూడు వస్తువుల్ని చూస్తేభయపడుతున్నారు.అంతేకాదు అసహనంతో అధికారులపై సీరియస్ అవుతున్నారు. యోగి భయపడుతున్న ఆ మూడు వస్తువులు ఏంటీ..?ఎందుకు..?

సీఎం టూర్ అంటే అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. మెప్పు పొందేందుకు కొందరు అత్యుత్సాహం చూపుతుంటారు. లేనివి అన్ని ఉన్నట్లు రాజ ప్రసాదంలా కలరింగ్ ఇస్తుంటారు. ఇదే చివరకు చిరిగి చాటవుతుంది.యూపీ సీఎం యోగి విషయంలో ఇదే జరిగింది.

ఈ మధ్య ఇతర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో ఎర్రతివాచీలు పరచడం, ఏసీ, సోఫా ఏర్పాట్లు చేయడం పట్ల సీఎం యోగి సీరియస్ అయ్యారు. సీఎం రాక తో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడం ఆయన వెళ్లిపోగానే వాటన్నింటినీ తీసేయడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. బయట ప్రదేశాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో తన కోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దని యోగి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో సోఫా.. ఏసీ.. ఎర్రతివాచీ లాంటివి ఏవీ చేయొద్దని సీఎం కార్యాలయ అధికారులు అన్ని జిల్లా పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించారు. సీఎం వస్తున్నారంటూ సామాన్య ప్రజలను ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా సహించబోయేది లేదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.