ఇద్దరు ఎమ్మెల్యేల పెళ్లి..వరుడు నాలుగేళ్లు చిన్న - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు ఎమ్మెల్యేల పెళ్లి..వరుడు నాలుగేళ్లు చిన్న

November 22, 2019

ఒకేే జాబ్ చేసేవారు, రెండు రాజకీయ పార్టీల కుటుంబాల పిల్లలు పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం. కానీ వధూ వరులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆ తర్వాత వివాహ బంధంతో ఓ ఏకమయ్యారు. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు ఆసక్తిగా మారింది. యూపీకి చెందిన అతిథి సింగ్, పంజాబ్‌కు చెందిన అంగద్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. రాజకీయ ప్రముఖుల మధ్య ఢిల్లీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో వధువు కంటే వరుడు నాలుగేళ్లు చిన్న వయస్సు కావడం మరో విశేషం. 

Congress MLA.

రాయ్‌ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్‌ లోని షహీద్ భగత్‌ సింగ్‌ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్‌ పెళ్లి చేసుకున్నారు. ఇక అంగద్ తండ్రి, ఎమ్మెల్యే ప్రకాష్ సింగ్ సైనీ, అదితి తండ్రి ఎమ్మెల్యే అఖిలేష్ సింగ్, గత రెండు దశాబ్దాలుగా మంచి స్నేహితులు.  వీరి రెండు కుటుంబాలకు చాాలా కాలంగా స్నేహం ఉండటంతో వీరిద్దరు దంపతులు అయ్యారు. వీరిద్దరూ కూడా 2017లోనే తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. వరుడు అంగద్ అత్యంత పిన్నవయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.