వలస కూలీల కోసం 1000 కాంగ్రెస్ బస్సులు.. ఓకే అన్న యోగి - MicTv.in - Telugu News
mictv telugu

వలస కూలీల కోసం 1000 కాంగ్రెస్ బస్సులు.. ఓకే అన్న యోగి

May 18, 2020

Congress

మొన్న యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు మృత్యువాత పడిని విషయం తెలసిందే. ఈ క్రమంలో వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఏకంగా వెయ్యి బస్సులను యూపీలో రంగంలోకి దింపుతోంది. ప్రియాంకా గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇచ్చింది. బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించగా యోగీ ఆమోదించారు.

ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి యూపీ వలస కార్మికులతో వెళ్తున్న ట్రక్కు ఔరాయ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతిచెందగా.. 36మంది గాయపడ్డారు. దీంతో ప్రియాంక గాంధీ వలస కూలీల కోసం తాము  బస్సులను ఏర్పాటు చేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.