యూపీ యూనివర్సిటీల్లో మొబైల్‌ వాడకంపై నిషేధం లేదు.. ఆ వార్త అవాస్తవం - MicTv.in - Telugu News
mictv telugu

యూపీ యూనివర్సిటీల్లో మొబైల్‌ వాడకంపై నిషేధం లేదు.. ఆ వార్త అవాస్తవం

October 22, 2019

UP Government Not Bans Mobile Phones in Colleges

ఈనెల 17వ తేదీన మేం (మైక్‌టీవీ.ఇన్)లో యూపీలోని కాలేజీలు.. యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధంపై పోస్టు చేసిన ‘విద్యార్థులకు షాక్.. మొబైల్ ఫోన్లపై నిషేధం’ వార్త ప్రచురణలో తప్పు దొర్లినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. వార్తలను తొందరగా పాఠకులకు చేరవేయాలనే ఉద్దేశ్యంతో పూర్తి వివరాలు తీసుకోవడంలో జరిగిన లోపం వల్ల వార్తను తప్పుగా ప్రచురించడం జరిగింది. ఈ వార్త తప్పుడు కథనం అని మాదృష్టికి రావడంతో వెంటనే దీన్ని సవరించుకోదలిచాం. జాతీయ మీడియాల్లో కూడా ఈ వార్తను పోస్టు చేశారు. వారితో పాటుగా మేం కూడా తప్పులో కాలేశాం. వేగంగా మీకు వార్తలను అందించడంలో భాగమే ఈ పొరపాటు.

నిజమైన.. నిక్కచ్చిగా ఉండే వార్తలను మాత్రమే ప్రచురించి మీ ఆధరణ అభిమానాలను మేం చూరగొన్నాం. కానీ ఇటీవల అన్ని మీడియా సంస్థలు ఈ వార్తపై పూర్తి వివరాలు తీసుకోకుండా తప్పుడు వార్తను పోస్టు చేశాయి. పూర్తి సమాచారం సేకరించడంలో మేం చేసిన చిన్నపాటి లోపం వల్ల ఈ వార్తను తప్పుగా వచ్చింది. ఇది ప్రజల్లోకి వెళ్లడంతో దీనిపై యూపీ అధికారులు స్పందించడంతో మా తప్పు తెలుసుకొని వివరణ ఇచ్చుకుంటున్నాం. ఇటువంటి వార్తలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహిస్తామని.. మా పాఠకులకు హామీ ఇస్తున్నాం.