అక్కడ  మాంసం,మద్యం  నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ  మాంసం,మద్యం  నిషేధం

October 28, 2017

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధుర జిల్లాలోని బృందావన్, బార్సానా  నగర పంచాయితీ ప్రాంతాల్లో మాంసం,మద్యం  అమ్మకాలను జరపకూడదనే  నిషేదాన్ని విధించారు. ఈవిషయాన్ని  శుక్రవారం ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం ప్రకటించింది.

‘బృందావన్ ప్రాంతంలో కృష్ణ భగవానుడు , ఆయన సోదరుడు బలరాముడు జన్మించారు . బార్సానా ప్రాంతంలో రాధ జన్మించినట్టు ఆధారాలు  ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో  మాంసం, మద్యం నిలిపివేయాలని   ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాయి.  ప్రతి రోజు లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.  పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదశ్ ప్రభుత్వం వీటిని  పవిత్ర పర్యాటక ప్రాంతాలుగా  ప్రకటించింది. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు, స్థానికులకు మంచి వసతులను కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.