Home > Corona Updates > కరోనా ఆస్పత్రుల్లో ఫోన్లపై నిషేదం

కరోనా ఆస్పత్రుల్లో ఫోన్లపై నిషేదం

Cellphone

ఐసోలేషన్ వార్డుల్లో సెల్‌ఫోన్ వాడకంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేదం విధించింది. కరోనా చికిత్స పొందుతున్న బాధితులు ఐసోలేషన్‌ వార్డుల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లొద్దని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని కోవిడ్‌ స్పెషల్‌ ఆసుపత్రులలో ఉన్న ఎల్‌-2, ఎల్‌-3 వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు సెల్‌ఫోన్లు వాడటానికి అనుమతి లేదని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

ఐసోలేషన్‌ వార్డు ఇన్‌చార్జ్‌ వద్ద రెండు ఫోన్లు ఉంటాయని, వాటినుంచి రోగులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చని సూచించింది. వార్డులో ఉండే మొబైల్‌ నంబర్లను రోగుల కుటుంబ సభ్యులకు కూడా ఇస్తామని, వారుకూడా వాటికి ఫోన్‌ చేయవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, 5జీ స్మార్ట్ ఫోన్ల తరంగాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని బ్రిటన్‌లో ప్రచారం జరుగింది. దీంతో ప్రజలు మొబైల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు. టవర్ల మరమ్మతులకు వెళుతున్న సిబ్బంది పైనా దాడులకు పాల్పడ్డారు.

Updated : 24 May 2020 5:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top