కొత్తగా పెళ్లైన వాళ్లకు అదిరిపోయే గిఫ్ట్..! - MicTv.in - Telugu News
mictv telugu

కొత్తగా పెళ్లైన వాళ్లకు అదిరిపోయే గిఫ్ట్..!

July 7, 2017

యూపీ సీఎం యోగి ఏం చేసినా దేశం చెప్పుకోవాల్సిందే.. ఏ నిర్ణయం తీసుకున్నా వారెవ్వా అనాల్సిందే..అంతలా డైనమిక్ డిసిషన్స్ ఉంటాయి. నవ జంటల కోసం యోగి తీసుకోబోతున్న ఈ నిర్ణయం వింటే నవ్వు వస్తోంది. కానీ తరచి తరచి ఆలోచిస్తే సూపర్ డిసిషన్ అనిపించక మానదు..ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే…

త‌్వ‌ర‌లోనే ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. జులై 11న వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ డే నాడు స్టార్ట్ చేయబోతున్నారు. దీని కింద నూతన వ‌ధూవ‌రుల‌కు కండోమ్స్‌, గ‌ర్భనిరోధ‌కాల‌ను ఇవ్వనుంది. న‌యీ ప‌హ‌ల్ పేరుతో ఈ కిట్ల‌ను ఇస్తారు. కండోమ్స్‌, కాంట్ర‌సెప్టివ్స్‌తోపాటు సుర‌క్షిత శృంగారంపై సందేశం, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాముఖ్య‌త‌, కొన్ని ట‌వ‌ల్స్‌, క‌ర్చీఫ్స్‌, నెయిల్ క‌ట్ట‌ర్‌, దువ్వెన‌లు, అద్దం ఈ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్స్‌ను ఆశా వ‌ర్క‌ర్లు పంపిణీ చేస్తారు.

జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న ఏడు రాష్ట్రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ మిష‌న్ ప‌రివార్ వికాస్ ప్రాజెక్ట్‌లో భాగంగా యోగి సర్కార్ ఈ పథకాన్ని తీసుకువస్తోంది. యూపీతోపాటు బిహార్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్‌, అసొంల‌లో ఈ మిష‌న్ ప‌రివార్ వికాస్ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొత్త దంప‌తుల ద‌గ్గ‌రికి వెళ్లి ఈ కిట్స్ ఇవ్వ‌డంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న‌దే త‌మ ఉద్దేశం అని యూపీ అధికారులు చెబుతున్నారు.

నిజంగా యూపీ సీఎం యోగి సూపర్. మెడికల్ షాపుల దగ్గరకెళ్లి అవి అడగాలంటే సిగ్గుపడేవారికి ఇదో వరం. ధైర్యంగా ఇంటిదగ్గరే వీటిని తీసుకుంటారు. అంతేకాదు కౌన్సిలింగ్ తరహాలో ఉపయోగపడుతోంది.