UP: Gunshots Weeds Color Kanyadan Bride Sister Shot Dead
mictv telugu

పెళ్లి వేడుకలో మేళగాళ్ల గొడవ.. కాల్పుల్లో వధువు చెల్లెలు మృతి

June 12, 2022

పెళ్లి వేడుకలో జరిగిన చిన్న వివాదం కాస్త గొడవకు దారి తీసి ఒకరు మృతికి కారణమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో పెళ్లిలో మేళం వాయించేందుకు వచ్చిన మేళగాళ్ల బృందం, వధూవరుల కుటుంబాల మధ్య జరిగిన వివాదం కాల్పులకు దారితీసింది ఈ ఘటనలో వధువు సోదరి మరణించగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

ఫరద్‌పుర గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తన కూతురు లలితకు .. మెహ్రుపుర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈ క్రమంలోనే వరుడు రాజ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ఊరేగింపుతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. శనివారం ఉదయం కన్యాదానం జరుగుతున్న సమయంలో వధూవరుల కుటుంబాలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ క్రమంలోనే మేళగాళ్ల బృందంపై రంగులు పడగా.. ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ తీవ్రమై.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో బుల్లెట్ తగిలి వధువు సోదరి సుధ మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్పీ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు.