మరో మనోహరాచారి.. కూతుర్ని నరికేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో మనోహరాచారి.. కూతుర్ని నరికేశాడు..

September 28, 2018

కులమత విభేదాలు దారుణాలకు దారితీస్తున్నాయి. ఆధిపత్య కులం, అణగారిన కులం.. ఏ కులమైనా సరే తమ కులమే గొప్ప అని వెర్రి తండ్రులు ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. తన కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మనోహరాచారి హైదరాబాద్ ఎర్రగడ్డలో కూతురు, అల్లుళ్లపై కొడవలితో దాడి చేయడం తెలిసిందే. కూతురు వేరే కులం యువకుడిని ప్రేమిస్తోందన్న ఆగ్రహంతో మరో తండ్రి కూడా తన కూతురును నరికేశాడు.UP Man Attacks Daughter with Axe Over Her Affair with Upper Caste Boy remembers Erragadda Manoharachari who hacked inter-caste coupleఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బార్బాలా గ్రామంలో జరిగిందీ దారుణం. బీఎస్సీ చదువుతున్న 18 ఏళ్ల స్వాతి గోస్వామి అనే యువతి తన క్లాస్‌మేట్ అయిన ఓ అగ్రవర్ణ యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల అతనితో కలసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన బంధువులు స్వాతి తండ్రి రాజ్ కుమార్‌కు ఉప్పందించారు. అతడు ఆగ్రహంతో రగిలిపోతూ బుధవారం గొడ్డలితో తన కూతురు భుజం, చేతులపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకుని, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రికి తరలించారు. తన కూతురు వేరే కులం వాడితో తిరడం ఇష్టం లేదని, కులాంతర పెళ్లి తనకిష్టం లేదని రాజ్ కుమార్ తెగేసి చెప్పాడు. ఈ ఉదంతంపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు పెట్టలేదని పోలీసులు చెప్పుకొచ్చారు.