UP man marries Pak girl after Facebook friendship
mictv telugu

ఫేస్‌బుక్ ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన యూపీ యువకుడు

June 21, 2022

UP man marries Pak girl after Facebook friendship

ఆ యువకుడి ప్రేమ దేశ స‌రిహద్దులు దాటింది. ఫేస్‌బుక్ లో పరిచయమైన ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను పొందటానికి దేశాన్ని దాటిమరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ చేరుకున్న వ్యక్తి, ఇప్పుడు గ్రాండ్ వెల్‌కమ్‌కు సిద్ధమవుతున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఫరూఖాబాద్‌కు చెందిన మహ్మద్ జమాల్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయిని ప్రేమించాడు.

ఆమె పాకిస్థానీ కావడంతో ఈ నెల ప్రారంభంలో మహ్మద్ జమాల్ దేశం దాటి, అక్కడికి వెళ్లి ప్రియురాలు ఇరామ్‌ను జూన్ 17న వివాహం చేసుకున్నాడు. జమాల్ తండ్రి అలీముద్దీన్.. కొత్త కోడలు ఇంటికి రాగానే గ్రాండ్‌గా పెళ్లి విందు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వారికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు కుటుంబసభ్యులంతా రెడీ అవుతున్నారు. ఇకపోతే ఫరూఖాబాద్ జిల్లా యంత్రాంగం ఆ దంపతులకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఒక సంవత్సరం తాత్కాలిక వీసా ఇస్తామని, దానని మూడేళ్ల వరకు పొడిగించవచ్చని తెలిపింది.ఈ సమయంలో పాకిస్తానీ అమ్మాయి ప్రత్యేక వివాహ చట్టం కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.