యోగి కేబినెట్‌లో విషాదం.. కరోనాతో మంత్రి కమలా రాణి మరణం - MicTv.in - Telugu News
mictv telugu

యోగి కేబినెట్‌లో విషాదం.. కరోనాతో మంత్రి కమలా రాణి మరణం

August 2, 2020

UP Minister Kamla Rani No More .

ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్‌లో కరోనా తీవ్ర కలకలం రేపింది.  మంత్రి కమలా రాణి వరుణ్ (62) మహమ్మారి కాటుకు బలి అయ్యారు. కొన్ని రోజుల క్రితం వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేబినెట్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆమె మరణంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

జులై 18 కరోనా నిర్ధారణ కావడంతో సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆమె పరిస్థితి విషమించింది. ఈ విషయం తెలిసిన వెంటనే రామ మందిర‌ ఫౌండేషన్ వేడుకకు సన్నాహాలను సమీక్షించ‌డానికి వెళ్లేందుకు సిద్ధమైన సీఎం యోగి ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా  1958 మే 3న జన్మించిన కమలా రాణి వరుణ్ ప్ర‌స్తుతం యూపీ టెక్నాలజికల్ ఎడ్యూకేషన్ మంత్రిగా పని చేస్తున్నారు. మూడుసార్లు ఆమె శాసన సభ్యురాలిగా ఉన్నారు.  25 మే 1975 న కిషన్ లాల్  వరుణ్‌ను పెళ్లి చేసుకున్న కమలా రాణికి ఒక కూతురు ఉన్నారు. ఈ సంఘటన ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది.