చేతివాటం వరకు ఓకే.. కానీ మొత్తం దోచుకోవద్దు : యూపీ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

చేతివాటం వరకు ఓకే.. కానీ మొత్తం దోచుకోవద్దు : యూపీ మంత్రి

April 25, 2022

 

అవినీతి, అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పాల్సిన మంత్రి దానికి మద్ధతిస్తూ, అదే సమయంలో అధికారులకు హితబోధ చేసిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఝాన్సీ జిల్లా తెహ్రోలీ ప్రాంతంలో కాలువలు, చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ పర్యటించారు. అయితే ఆశించినంతగా పనులు జరక్కపోవడం, పరిసరాలు మురికిగా ఉండడంతో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కారణం నిధులలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని మంత్రి గ్రహించారు. ఈ సందర్భంగా.. నెల నెలా వచ్చే జీతాలు కాకుండా కుటుంబాల కోసం అదనంగా సంపాదించాలనుకోవడం తప్పుకాదనీ, అలాగని మొత్తం దోచేస్తామనడం కరెక్టు కాదని అధికారులను మందలించారు. పనులు త్వరగా చేసి రైతుల పొలాలకు నీరందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కాగా, మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.